కర్నూలు: పత్తి రైతులను వెనక్కి పంపించవద్దు: కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి
పత్తి లో తేమ శాతం సీసీఐ వారు కొనుగోలు చేసే దాని కంటే ఎక్కువ శాతం ఉన్నట్లయితే రైతులను వెనక్కి పంపించకుండా మిల్లుల ద్వారా కొనుగోలు చేయించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి మార్కెటింగ్ ఏడి ని ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆదోని లో బత్తిన అభిరామ్, లక్ష్మీ చెన్నకేశవ జిన్నింగ్ & ప్రెస్సింగ్ యూనిట్ లలో సీసీఐ ద్వారా జరుగుతున్న పత్తి కొనుగోలు ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ ఏ మండలం నుండి వచ్చారు, తీసుకొచ్చిన పత్తిని సిసిఐ వారు కొనుగోలు చేశారా, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కలెక్టర్ రైతులను ఆరా తీశారు? తాము తీసుకొచ్చిన పత్తిని తేమ