డోన్: బేతంచెర్ల సిపిఐ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర సమరయోధులు స్వామి రెడ్డి 113 వ జయంతి వేడుకలు
Dhone, Nandyal | Jul 1, 2026 స్వాతంత్ర్య సమరయోధుడు, సీపీఐ సీనియర్ నాయకుడు కామ్రేడ్ యాలూరి స్వామిరెడ్డి 113వ జయంతి సందర్భంగా బేతంచెర్ల సీపీఐ కార్యాలయంలో బుధవారం ఘనంగా నివాళులర్పించారు. మండల కార్యదర్శి భార్గవ్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. అనంతరం కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై రైతులు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జీవితాంతం పోరాటం చేశారు