నంద్యాల అర్బన్: అలగనూరు నుంచి రేగడ గూడూరు కు వెళ్లే మార్గంలో డివైడర్ను ఢీకొట్టిన బైక్, బైక్ పై వెళుతున్న వ్యక్తి మృతి
Nandyal Urban, Nandyal | May 31, 2026
నంద్యాల జిల్లా గడివేముల మండలం అలగనూరు నుండి రేగడి గూడూరు కి వెళ్లి మార్గంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది అలగనూరు గ్రామానికి చెందిన ఆదాం భాష బైక్ పై వెలుగోడు కు వెళ్తుండగా ప్రమాదవశాత్తు డివైడర్ను ఢీకొట్టాడు. దీంతో పక్కనే ఉన్న కాలువలో పడిపోయాడు. ఈ ప్రమాదంలో ఆదాం భాష అక్కడికక్కడే మృతిచెందాడు స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. గడివేముల పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు