వివిధ సమస్యలను పరిష్కరించాలని జిల్లా నలుమూలల నుండి వచ్చి వచ్చిన ప్రజల నుండి స్వీకరించే అర్జీలను నాణ్యతగా పరిష్కరించాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శివ్ నారాయణన్ శర్మ అధికారులను ఆదేశించారు.సోమవారం ఉదయం 10:30 గంటల సమయంలో అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవన్ జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీ డ్రస్సల్ స్ సిస్టం పిజిఆర్ఎస్) కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి ఫిర్యాదులను ఇన్చార్జి కలెక్టర్ స్వీకరించారు. అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డిఆర్ఓ మలోల, కళ్యాణ్ దుర్గం ఆర్డీవో వసంత బాబు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.