సంతనూతలపాడు: ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శిగా ఉప్పుగుండూరు కు చెందిన వెంకట సురేష్ బాబు ఏకగ్రీవంగా ఎన్నిక
నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో ఉప్పుగుండూరు గ్రామానికి చెందిన కొంజేటి వెంకట సురేష్ బాబును ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శిగా ఆర్యవైశ్య మహాసభ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా గ్రామానికి చెందిన అమర వేణు ను ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన సురేష్ బాబు మాట్లాడుతూ... రాష్ట్రంలో ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి ఆర్యవైశ్య మహాసభ సభ్యులతో కలిసి కృషి చేస్తానని తెలిపారు.