జహీరాబాద్: మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేసిన ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో మహిళా సంఘాల సభ్యులకు ఎంపీ సురేష్ షెట్కార్ వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశారు. మంగళవారం సాయంత్రం పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం పెద్ద పీట వేస్తూ రుణాలు పంపిణీ చేస్తూ ఉందని అన్నారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, జడ్పీ సీఈవో జానకిరెడ్డి, జహీరాబాద్ ఆర్డీవో దేవుజాతో కలిసి చెక్కులు పంపిణీ చేశారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాల్లో భాగంగా పలువురు లబ్ధిదారులకు కార్లు, ట్రాక్టర్లు పంపిణీ చేసి ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు.