నంద్యాల అర్బన్: రూ.12 వేల కోట్లతో శ్రీశైలానికి హైవే : మార్కాపురంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనామం రెడ్డి
Nandyal Urban, Nandyal | Jun 17, 2026
దోర్నాల-శ్రీశైలం-బ్రాహ్మణపల్లి (తెలంగాణ) ఎలివేట్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. మార్కాపురంలో ఆయన మాట్లాడుతూ.. ‘రూ. 12వేల కోట్లతో 80 కిలో మీటర్ల మేర నాలుగు వరుసల హైవే (ఎలివేటెడ్ కారిడార్) నిర్మాణానికి ప్రభుత్వం సూచనప్రాయంగా ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయకుండా రైతులను మోసం చేసింది' అని మంత్రి చెప్పారు