డోన్: డోన్ లో వెలుగు కార్యాలయం వద్ద పొదుపు సంఘం మహిళల ఆందోళన
Dhone, Nandyal | Apr 8, 2026 డోన్ మండలం మిద్దపల్లెకు చెందిన పొదుపు సంఘం మహిళలు తమకు న్యాయం చేయాలని వెలుగు కార్యాలయం వద్ద ధర్నా చేశారు. గ్రామానికి చెందిన చెన్నకేశవులు అనే బుక్ కీపర్ రూ. లక్షల్లో మోసం చేశాడని ఆరోపించారు. పొదుపు సభ్యులకు తెలియకుండా బ్యాంకులో డబ్బులు తీసుకున్నాడని, వెలుగు అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.