మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి.
మదనపల్లె నియోజకవర్గ వైయస్సార్ పార్టీ ఇన్చార్జి నిసార్ అహ్మద్.
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో వైయస్సార్ పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు మదనపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో స్థానిక బుధవారం మధ్యాహ్నం. చిత్తూరు బస్టాండ్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మదనపల్లె నియోజకవర్గ ఇన్చార్జిని నిసార్ అహ్మద్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ విధానాన్ని రద్దు చేసేంతవరకు పోరాటాలు కొనసాగిస్తామని అన్నారు.