నారాయణపేట్: విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి: పిడిఎస్యు డిమాండ్
తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండ విద్యార్థుల భవిష్యత్తుతో ఆట లాడడం సరికాదని పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు ఎస్.సాయి కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ భవన్ లో మంగళవారం నాలుగున్నర గంటల సమయంలో పిడిఎస్యు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన ఉచిత విద్య భావాన్ని పాలకవర్గ పార్టీలు అర్థం చేసుకోవాలని అన్నారు. పెండింగ్ లో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు.