డోన్: రైతులకు శాశ్వితసాగునీటి భద్రతే లక్ష్యం : డోన్ ఎమ్మెల్యే కోట్ల
Dhone, Nandyal | Jun 19, 2026 రైతులకు శాశ్వత సాగునీటి భద్రతే లక్ష్యమని ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. డోన్ మండలం కొత్తబురుజు సమీపంలోని తిప్పమ్మ కుంట,వెంగళం కుంటలను సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెరువుల ప్రస్తుత పరిస్థితి, నీటి నిల్వ సామర్థ్యం, అభివృద్ధి పనుల అవసరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలోని రైతాంగానికి సాగునీటి ఇబ్బందులు ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు