గుంతకల్లు: గుత్తి మండలం శ్రీపురం గ్రామంలో పశువుల లింగ నిర్ధారతపై రైతులకు అవగాహన కల్పించిన పశు వైద్యాధికారులు
అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని శ్రీపురం గ్రామంలో పశువులో లింగ నిర్ధారతపై రైతులకు పశు వైద్యాధికారులు అవగాహన కల్పించారు. మంగళవారం గ్రామంలోని రైతు సేవా కేంద్రం వద్ద రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద గర్భకోశ చికిత్సలు, పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎల్డీఏ ఈఓ వెంకటేష్, అనిమల్ హస్బెండరి డీడీ రమేష్ రెడ్డి మాట్లాడుతూ గాలి కుంటు వ్యాధి టీకాల గురించి రైతులు తెలుసుకోవాలన్నారు. ముద్ద చర్మ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.