ఒంగోలు అర్బన్: వైసీపీ నేతల విమర్శలకు ఘాటుగా తిప్పి కొట్టిన హుడా చైర్మన్ జనసేన నేత షేక్ రియాజ్
Ongole Urban, Prakasam | Jun 26, 2026
వైసీపీ నేతల విమర్శలకు జనసేన నాయకులు రియాజ్ ఘాటుగా స్పందించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని ఆయన అన్నారు. పంచాయతీరాజ్, అటవీ శాఖల్లో పవన్ కళ్యాణ్ పనితీరును గణాంకాలతో నిరూపిస్తామని సవాల్ విసిరారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యం జరిగిందని ఆరోపించిన రియాజ్... ప్రస్తుతం అక్రమ రవాణా గణనీయంగా తగ్గిందన్నారు. పంచాయతీల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, అక్రమ రవాణాపై తీసుకున్న చర్యలే ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు. వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు రావాలని కూడా సవాల్ విసిరార