రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం నగరి పట్టణంలోని AJS కళ్యాణ మండపంలో మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించినట్లు నగరి మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా మెప్మా పీడీ రవీంద్ర హాజరైనట్లు తెలియజేశారు. 530 బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి పరీక్ష చేసుకున్నట్లు చెప్పారు. మహిళలకు 16 రకాల పరీక్షలు చేసినట్లు వెల్లడించారు. మహిళల ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందన్నారు.