డోన్: బేతంచర్ల మండలంలో పీర్ల చావిడి వద్ద యువకుల సందడి
Dhone, Nandyal | Jun 25, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలో మతసామరస్యానికి ప్రతీకగా జరుపుకునే మొహర్రం పండుగ వేడుకలను ఆయా గ్రామాల్లో వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఆయా గ్రామాల్లో కొలువైన పీర్ల చావిడీల ముందు ఉన్న అగ్ని గుండాల చుట్టు యువకులు సాంప్రదాయ నృత్యం చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు ఆయా గ్రామాల్లోని పీర్లచావిడిలను నిర్వాహకులు విద్యుత్ దీపాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.