మైదుకూరు నియోజకవర్గంలోని నాయి బ్రాహ్మణులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ హామీ ఇచ్చారు. శుక్రవారం ప్రొద్దుటూరులోని తన నివాసంలో ఎమ్మెల్యేను కలిసిన నాయి బ్రాహ్మణులు తమ సమస్యలను వివరించారు. మైదుకూరు పట్టణంలో ఇతర కులస్తులు నాయి వృత్తిని చేపట్టడంతో తామంతా ఉపాధి కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్, సమస్యను పరిశీలించి న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు.