నంద్యాల అర్బన్: నంద్యాలలో బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రారంభం
Nandyal Urban, Nandyal | Apr 11, 2026
నంద్యాల బార్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ శనివారం ప్రారంభమైంది. అధ్యక్షుడు, కార్యదర్శి వంటి కీలక పదవులకు తీవ్ర పోటీ నెలకొనడంతో న్యాయవాదులు భారీగా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సమన్వయ కమిటీ పర్యవేక్షణలో ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. సాయంత్రం పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు.