ఆత్మకూరు: సంజీవ్ నగర్‌లోని గిరిజన కాలనీలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరిన సీపీఎం పార్టీ కార్యదర్శి అన్వర్ #localissue
నెల్లూరు జిల్లా, అనంతసాగరం మండలం, సంజీవ్ నగర్ లోని గిరిజన కాలనీలో సిపిఎం పార్టీ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పర్యటించారు. ఇంటింటికి వెళ్లి గ్రామీణ శ్రామికుల సర్వే చేయడం జరిగిందన్నారు. స్థానికులు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే సమస్యలను అధికారులు పరిష్కరించాలని ఈ సందర్భంగా సీపీఎం పార్టీ మండల కార్యదర్శి అన్వర్ భాష కోరారు. ఈ కార్యక్రమంలో అనంతసాగరం టౌన్ కార్యదర్శి జకరయ్య, నాయకులు తిక్కవరపు రవి, తదితరులు ఉన్నారు.