జహీరాబాద్: లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మాణిక్ రావు
సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం మాడిగి గ్రామంలో లక్ష్మీదేవి ఆలయ ఉత్సవాల్లో ఎమ్మెల్యే మాణిక్ రావు పాల్గొన్నారు. బుధవారం సాయంత్రం గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే మాణిక్ రావు, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ను ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.