సూర్యాపేట: కార్మికులను తక్షణమే విడుదల చేయాలి: IFTU
రాష్ట్ర ఉపాధ్యక్షుడు జనార్ధన్, జిల్లా ప్రధానకార్యదర్శి నాగయ్య డిమాండ్
డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగిన ఘర్షణలో అరెస్టు చేసిన UP కార్మికులను తక్షణమే విడుదల చేయాలని IFTU రాష్ట్ర ఉపాధ్యక్షుడు జనార్ధన్, జిల్లా ప్రధానకార్యదర్శి నాగయ్య డిమాండ్ చేశారు. IFTU బృందంతో ఫ్యాక్టరీని సందర్శించి మాట్లాడారు. చనిపోయిన కార్మికుడికి నష్టపరిహారం చెల్లించాలని ఆందోళనకు దిగిన సమయంలో పోలీసులు అతిగా వ్యవహరించడం మూలంగానే ఘటన చోటు చేసుకుందని ఉద్దేశపూర్వకంగా చేసినది మాత్రం కాదన్నారు.