త్రిపురారం: జమ్మూ కాశ్మీర్‌కు బయలుదేరిన బిఎస్ఎఫ్ జవాన్, ఘనంగా సన్మానించిన జనగణమన ఉత్సవ సమితి సభ్యులు, గ్రామస్తులు
నల్గొండ జిల్లా, త్రిపురారం మండలం, బుజ్జికల్ గ్రామానికి చెందిన బిఎస్ఎఫ్ జవాన్ పోలిశెట్టి మహేష్ సెలవుల్లో ఉన్నాడు. భారత్, పాక్ యుద్ధం సందర్భంగా ఉన్నతాధికారుల పిలుపు మేరకు సోమవారం జమ్ము కాశ్మీర్ కు పయనమయ్యాడు. విషయం తెలుసుకున్న జనగణమన ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు మహేష్ ను, అతని తల్లిదండ్రులను సోమవారం మధ్యాహ్నం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు భారత మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.