ఒంగోలు అర్బన్: ట్రావెల్ బస్ లను ప్రతిరోజు తనిఖీలు చెయ్యటం జరుగుతుంది.నిబంధనలు పాటించక పోతే చర్యలు తప్పవు : జిల్లా ఎస్పీ హర్షవర్ధన్
Ongole Urban, Prakasam | Apr 13, 2026
ట్రావెల్ బస్సులను ఉమ్మడి ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం తనిఖీలు చేపడుతున్నారని నిబంధనలు పాటించని వాటిపై చర్యలు తీసుకుంటున్నట్లుగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియజేశారు. అదనపు సీట్లు కేటాయింపు జరిగిన సరైన నిబంధనలు పాటించకపోయినా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. మైనర్ డ్రైవింగ్, అధిక శబ్దాలు చేసే సైలెన్సర్ల వాడకం, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అధిక ఫోకస్ లైఫ్ లో పైన కూడా నిషిత పరిశీలనను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు