గుంతకల్లు: తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కలిసిన గుత్తి వైసీపీ నాయకులు
తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను గుత్తి పట్టణ వైసీపీ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు కటిక ఖురేషి అన్వర్ కలిశారు. గుత్తిలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల గురించి అన్వర్ వివరించారు. స్థానిక ఎన్నికల్లో కష్టపడి పని చేసి పార్టీ గెలుపుకు కృషి చేయాలని వైయస్ జగన్ సూచించినట్లు అన్వర్ చెప్పారు. పార్టీ బలోపేతం కోసం కూడా కృషి చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. అన్ని విషయాలను చర్చించామని అన్వర్ చెప్పారు.