కామారెడ్డి: కలెక్టరేట్లో బ్యాంకర్లతో సమీక్ష, అర్హులైన అందరికీ సకాలంలో పంట రుణాలు అందేలా చూడాలి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
బుధవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆధ్వర్యంలో జరిగిన బ్యాంకర్ల సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన అందరికీ సకాలంలో పంట రుణాలు మంజూరు చేయవలసిందిగా ఆదేశించారు. పోడు భూములకు కూడా పంట రుణాలను అందజేయాలని బ్యాంకర్లకు ఆదేశించారు. వరదల వల్ల దెబ్బతిన్న ఎం ఎస్ ఎం ఈ యూనిట్లకు రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. DFS ప్రవేశపెట్టిన స్వచ్ఛత హి సేవ కార్యక్రమాన్ని 17 సెప్టెంబర్ నుండి 2 అక్టోబర్, 2025 సంవత్సరం వరకు జరిగే క్యాంపెయిన్ కలెక్టర్ ఆధ్వర్యంలో పోస్టర్లను ఆవిష్కరించారు.