బనగానపల్లె: బనగానపల్లెకు సిఎస్ఆర్ నిధులు మంజూరు చేయాలని పవర్ గ్రిడ్ చైర్మన్ కోరిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
నంద్యాల జిల్లా బనగానపల్లె ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు CSR నిధులను మంజూరు చేయాలని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ బుర్రా వంశీ రామమోహన్ను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కోరారు. హర్యానాలోని గురుగ్రాంలో ఆయనను కలిశారు. కొలిమిగుండ్ల మండలం నందిపాడులో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న హైవోల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్స్ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై చర్చించారు.