డోన్: డోన్ లో నిర్లక్ష్యం డ్రైవింగ్,రెండేళ్ల బాలుడికి గాయాలు
Dhone, Nandyal | Apr 21, 2026 డోన్లో మద్యం మత్తులో ఆకతాయిల నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా ప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వెనకాల సీసంగుంతల కట్టుకట్టే సమీపంలో రెండేళ్ల బాలుడిని బైకుతో ఢీ కొట్టారు. స్థానికులు వెంటనే బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మైనర్లు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వెంటనే పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు