ఈనెల 17న నిర్వహించనున్న ప్రజా పాలన వేడుకలకు విస్తృతస్థాయిలో ఏర్పాట్లు చేయాలన్న కలెక్టర్ సత్య శారదా దేవి
ఆజం జాహి మిల్స్ గ్రౌండ్స్ లో నిర్మిస్తున్న కొత్త కలెక్టరేట్ ప్రక్కన నిర్వహించనున్న ప్రజా పాలన వేడుకలను పురస్కరించుకొని సోమవారం సాయంత్రం 6 గంటలకు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు కలెక్టర్ సత్యసారదా దేవి. ఈ వేడుకలకు అటవీ పర్యావరణ దేవాదాశాఖ మంత్రి కొండ సురేఖ విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీ ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారుల ఆదేశించారు