చీమకుర్తి మండలంలోని దేవరపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని సంక్రాంతి ముగ్గుల పోటీలను గురువారం ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు తరలివచ్చి పాఠశాల ఆవరణలో రకరకాల రంగవల్లులతో ముగ్గులను అందంగా తీర్చిదిద్దారు. మంచి ప్రతిభ కనబరిచి బాగా ముగ్గులు వేసిన మహిళలను విజేతలుగా ప్రకటించిన నిర్వాహకులు వారికి బహుమతి ప్రధానం చేశారు.