డోన్: రంగాపురం రైల్వే గేట్ వద్ద ట్రాఫిక్ జాం
Dhone, Nandyal | May 9, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండల పరిధిలోని రంగాపురం రైల్వే గేట్ వద్ద శనివారం వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా తరచూ గేటు వేయడంతో డోన్, బేతంచెర్ల వైపు వాహనాలు భారీగా నిలిచిపోయాయి. మండే ఎండలో గంటల తరబడి వేచి ఉండలేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.