వాంకిడి: జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎస్పీ కాంతిలాల్ పాటిల్
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తందని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి, జిల్లా ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ చిత్తరంజన్, డీఎస్పీలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు