కర్నూలు: కర్నూలు లో విద్యార్థి మృతిపై రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దిగ్భ్రాంతి
కర్నూలులోని ఓ ప్రైవేట్ స్కూల్లో గోడ కూలి విద్యార్థి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. సోమవారం ఉదయం 12 గంటలు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో బాలుడు చనిపోవడం తనకు ఎంతో బాధ కలిగిస్తోందన్నారు. బాలుడి కుటుంబానికి స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పారు. గాయాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఘటనపై విచారణ చేయిస్తామన్నారు.