అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా తాడిపత్రిలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వృద్ధురాలిని ఢీకొన్న ద్విచక్ర వాహన దారుడు వృద్ధురాలికి గాయాలు
Anantapur Urban, Anantapur | Apr 25, 2026
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని తాడిపత్రి పట్టణంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వృద్ధురాలిని ద్విచక్ర వాహనదారుడు వేగంగా వచ్చి ఢీకొన్న ఘటనలో వృద్ధురాలికి తీవ్ర గాయాలైన సంఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది. దీంతో ఆమెను అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి హుటా హుటినా తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.