బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణం రవీంద్రనగర్ లో ఎద్దు చేసిన దాడిలో రాజారాం అనే వ్యక్తి మృతి
బెల్లంపల్లి పట్టణం రవీంద్ర నగర్ కు చెందిన జంగంపల్లి రాజారాం అనే వ్యక్తిని ఎద్దు పొడవడంతో మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బస్తిలోని రహదారిపై ఓ ఎద్దు ముకుతాడుతో ఇబ్బంది పడుతుండగా గమనించిన అతను ఎద్దు వద్దకు వెళ్లి తాడును సరి చేసే క్రమంలో కొమ్ములతో అతన్ని పొడిచింది. దీంతో ఛాతి భాగం పై కొమ్ము దిగి తీవ్ర గాయాలయ్యాయి. బెల్లంపల్లి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించే సమయంలో వ్యక్తి మృతి చెందారు. ఆస్పత్రి వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాళ్ల గురిజాల పోలీసులు తెలిపారు