డోన్: డోన్ లో ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
Dhone, Nandyal | Apr 6, 2026 డోన్లో భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు సుధాకర్ నాయకులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యకర్తలు మిఠాయిలు పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పార్టీ అభివృద్ధికి తోడ్పడిన వారిని సత్కరించారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్య కర్తలు భారీగా పాల్గొన్నారు.