ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలో మండుతున్న ఎండలు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎండలు రోజురోజుకు అధికమవుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, బుధవారం ఆళ్లగడ్డలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో రోడ్లపై తిరగాలంటే ప్రజలు బెంబేలెత్తుతున్నారు, వృద్ధులు పిల్లలు ఉదయం పదకొండు గంటలకే పనులు ముగించుకొని ఇల్లు చేరుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు, ఉదయం 11 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రాకూడదని తెలిపారు.