వర్ధన్నపేట: వర్ధన్నపేట టౌన్ లోని CHCని ఆకస్మికంగా తనిఖీ డాక్టర్లు లేకపోవడంతో ఉన్నత అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లిన ఎమ్మెల్యే
వర్ధన్నపేట టౌన్ లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC) ని ఆకస్మికంగా తనిఖీ చేపట్టి హాస్పిటల్ డాక్టర్లు నర్సులు సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించగా విధులు నిర్వహించాల్సిన డాక్టర్లు చాలా వరకు లేకపోవడంపై వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ లో భాగంగా ఆయన, రోగులకు సరిపడా వైద్యులు అందుబాటులో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్ల కంటే కేవలం ఇద్దరు డాక్టర్లు మాత్రమే ఉండడంతో మిగతా డాక్టర్లు కనిపించకపోవడంతో, ఆయన జిల్లా ఆరోగ్య శాఖ అధికారులకు ఫోన్ చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించ