నిజామాబాద్ రూరల్: ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన సీనియర్ రిపోర్టర్ నారాయణ కుటుంబాన్ని పరామర్శించిన పిసిసి మహేష్ కుమార్ గౌడ్
ఇటీవల గుండెపోటుతో మరణించిన డిచ్పల్లి మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన సీనియర్ రిపోర్టర్ నారాయణ కుటుంబాన్ని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. స్థానిక నాయకులతో కలిసి ఆయన బాధిత కుటుంబ సభ్యులను ధైర్యం చెప్పారు. అత్యంత విధేయతతో, కర్తవ్యనిబద్ధతతో జర్నలిజం రంగంలో కొనసాగిన నారాయణ గుండెపోటుతో అకస్మాత్తుగా కన్నుమూయడం బాధాకరమని టీపీసీసీ చీఫ్ పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటానని భరోసా కల్పించారు.