పుంగనూరు: కాలువలపై నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించిన అధికారులు.
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ చౌడేపల్లి ఎంపీడీవో కార్యాలయం వద్ద కాలువను ఆక్రమించి అక్రమంగా నిర్మించిన కట్టడాలను శుక్రవారం మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతంలో రెవెన్యూ అధికారులు జెసిబి ల సహాయంతో తొలగించారు. గత రెండు రోజుల క్రితం చౌడేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వరద నీరు చేరి కళాశాలలో వెళ్లేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడ్డ విషయం విధితమే. ముందస్తు చర్యలో భాగంగా రెవిన్యూ అధికారులు కాలువలపై అక్రమ నిర్మాణాలను జెసిబి సహాయంతో తొలగించారు.