డోన్: డోన్ లో మానవత్వం చాటుకున్న ద్రోణాచలం సేవా సమితి సభ్యులు, అనాధ శవానికి అంత్యక్రియలు
Dhone, Nandyal | Apr 29, 2026 సభ్యులు డోన్ సమీపంలోని దొరపల్లె బ్రిడ్జ్ వద్ద అనారోగ్యంతో మృతి చెందిన 75 ఏళ్ల అనాధ వృద్ధుడికి ద్రోణాచలం సేవా సమితి అంత్యక్రియలు నిర్వహించింది. రైల్వే జీఆర్పీ పోలీసులు విజ్ఞప్తి చేయడంతో స్పందించిన సేవా సైనికులు బుధవారం హిందూ సంప్రదాయ పద్ధతిలో కార్యక్రమాన్ని పూర్తి చేశారు. సేవా సమితి ఇప్పటివరకు 135 మంది అనాధలకు ఆత్మబంధువుగా అంత్యక్రియలు నిర్వహించి తమ ఉదారతను చాటుకుంది.