డోన్: డోన్ పోలీసులపై దాడి చేసి పరారైన నిందితుల కోసం గాలింపు చర్యలు
Dhone, Nandyal | Jul 3, 2026 నంద్యాల జిల్లా డోన్ సమీపంలో నేలకనుమ మెట్ట జియో పెట్రోల్ బంక్ వద్ద తనిఖీలను నిర్వహించామని సీఐలు ఇంతియాజ్ బాషా, రాకేశ్ తెలిపారు. పందుల దొంగతనం చేసి గూడ్స్ వాహనంలో గుత్తి వైపు వెళ్తున్నట్లు సమాచారంతో వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నంలో నిందితులు పోలీసులపై రాళ్లు, గాజు సీసాలతో దాడి చేశారు. ఆత్మరక్షణలో పోలీసులు ఒక రౌండ్ కాల్పులు జరిపారు. నిందితులు ప్యాపిలి వైపు పరారయ్యారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన సిఐలు తెలిపారు