పెదబయలు మండలం గోమంగి మినీ గురుకులంను తనిఖీ చేసిన విజయనగరం ఆర్టీసీ రీజినల్ చైర్మన్ సియ్యారి దొన్ను దొర
టీడీపీ అరకు నియోజకవర్గ ఇన్చార్జి, ఏపిఎస్ఆర్టిసి విజయనగరం జోన్ చైర్మన్ సియ్యారి దొన్ను దొర పెదబయలు మండలం గోమంగి మినీ గురుకులంలో ఆదివారం మద్యాహ్నం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ నెలకొన్న పరిస్థితులను ప్రత్యక్షంగా చూశారు. ప్రతి రోజూ కిచిడి తప్ప ఒక్క రోజు కూడా మెనూ అమలు చేయడం లేదని, సరైన బా త్ రూమ్, గాని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలనే విషయాలను సిబ్బంది పూర్తిగా విస్మరించారని విద్యార్థులు వివరించారు. సమస్యలన్నీ అధికారులు దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు దొన్నుదొర హామీ ఇచ్చారు.