ఒంగోలు అర్బన్: ఒంగోలులో గతంలో గంజాయి తాగిన యువతకు కౌన్సిలింగ్, మత్తు పదార్థాలకు గంజాయి కి దూరంగా ఉండాలని సిఐ భీమా నాయక్ హెచ్చరిక
Ongole Urban, Prakasam | May 5, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో బుధవారం టాస్క్ ఫోర్స్ సీఐ భీమా నాయక్ గతంలో గంజాయి తాగి పట్టుబడి యువతకు కౌన్సిలింగ్ ఇచ్చారు. నిరంతరం మీ పైన నిఘా ఉంటుందని పద్ధతి మార్చుకొని మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని యువతకు సీఐ సూచించారు. మళ్లీ గంజాయి తాగేందుకు ప్రయత్నించిన లేదా గంజాయి విక్రయించేందుకు ప్రయత్నించిన కఠిన చర్యలతో పవని సిఐ భీమా నాయక్ యువతను తీవ్రంగా హెచ్చరించారు. అలానే వారి తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు.