కర్నూలు: 187 మంది లబ్ధిదారులకు 17న గృహాలు అప్పగింత: కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
కర్నూలు నగర శివార్లలోని ఎన్టీఆర్ కాలనీ టిడ్కో గృహాలను అన్ని సదుపాయాలతో తీర్చిదిద్దుతామని, ఈ నెల 17న 187 మంది లబ్ధిదారులకు ఇళ్లను అప్పగిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు టిడ్కో గృహాలను పరిశీలించారు. మరమ్మత్తులు, సదుపాయాలు, పనుల నాణ్యతలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. టిడ్కో కాలనీలో రహదారులు, డ్రైనేజీ, విద్యుత్, రేషన్, పింఛన్, తాగునీరు వంటి సదుపాయాలను పూర్తిచేసినట్లు తెలిపారు. లబ్ధిదారులు సౌకర్యవంతంగా నివసించేలా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు.