డోన్: డోన్లో విలేజ్ హెర్డ్ ఫర్టిలిటీ రిజిస్టర్ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కోట్ల
Dhone, Nandyal | Jun 11, 2026 ఏపీ పశుసంవర్ధక శాఖ నిర్వహించనున్న విలేజ్ హెర్డ్ ఫర్టిలిటీ రిజిస్టర్ పుస్తకాన్ని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశుసంవర్ధక రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిదని అన్నారు. పశువుల ఆరోగ్యం, సంతానోత్పత్తి వివరాలను ఖచ్చితంగా నమోదు చేయడం ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించవచ్చని ఆయన తెలిపారు.