డోన్: డోన్ లో నిఘా వ్యవస్థ పటిష్టం : డీఎస్పీ శ్రీనివాసులు
Dhone, Nandyal | May 24, 2026 డోన్లో నేరాలు, చోరీలను అరికట్టేందుకు పోలీసులు నిఘాను బలోపేతం చేశారు. డీఎస్పీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పట్టణంతో పాటు జాతీయ రహదారిపై ఉన్న సీసీ కెమెరాలను పర్యవేక్షిస్తున్నామని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. దీనికోసం ప్రత్యేకంగా ముగ్గురు సిబ్బందిని నియమించామన్నారు. ఇప్పటికే 108 సీసీ కెమెరాలు, కీలక కూడళ్లలో ఏఎన్పీఆర్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు