డోన్: అధికారులుప్రజలకు మెరుగైన సేవలందించాలి :డోన్ ఎమ్మెల్యే కోట్ల
Dhone, Nandyal | May 20, 2026 అధికారులు సమన్వయంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి అన్నారు. బుధవారం డోన్ పట్టణంలో బేతంచెర్ల, డోన్, ప్యాపిలి మండలాల వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రజల సమస్యల పరిష్కారంతో పాటు ఆయా గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. నిర్లక్ష్యం వహించకుండా విధులు నిర్వహించాలన్నారు.