సర్వేపల్లి: పిడుగుపాటుకు వెంకటాచలంలో వ్యక్తి మృతి, అండగా ఉంటామన్న జనసేన
వెంకటాచలం మండలం శ్రీకాంత్ కాలనీలో పిడుగుపాటుకు మస్తానయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జనసేన నియోజకవర్గ ఇన్చార్జి సురేష్ నాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని ప్రభుత్వం నుంచి రావాల్సిన సాయం అందేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నేతలు ఉన్నారు.