రాయచోటి:రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
సుండుపల్లి మండలంలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగి వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. స్థానిక రాజుల కాలనీకి చెందిన నాగరాజు (50) సొంత పనిమీద బైక్ లో రాయచోటికి బయలు దేరాడు. స్కూటర్ మార్గమధ్యంలోని అనుపల్లి వద్ద ఎదురుగా వస్తున్న వాహనానికి సైడ్ ఇవ్వబోయి అదుపుతప్పి పడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి బాధితుడిని చికిత్స కోసం వెంటనే రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.