నంద్యాల అర్బన్: ఓంకారం కేత్రంలో అదృస్యమైన వృద్దురాలి మృతి
Nandyal Urban, Nandyal | Apr 20, 2026
నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం ఓంకార పుణ్యక్షేత్రం వద్ద ఆదివారం అదృశ్యమైన ప్రొద్దుటూరుకు చెందిన జింకల లక్ష్మీదేవి మృతి చెందినట్లు ఎస్సై జగన్మోహన్ తెలిపారు. టీజీపీ కెనాల్ కట్ట మీద నుంచి ప్రమాదవ శాత్తు జారిపడి మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అలాగే లక్ష్మీదేవికి చెందిన సుమారు 12 తులాల బంగారు ఆభరణాలు కూతురుకి అప్పగించినట్లు ఎస్సై తెలిపారు.