నేరడిగొండ: మండల కేంద్రంలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే ఆన్లైన్ నమోదు ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ రాజర్షి షా
సమగ్ర కులగణన,ఇంటింటి కుటుంబ సర్వే సామాజిక, ఆర్ధిక , పరిస్థితుల విశ్లేషణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వే వివరాలను డిసెంబర్ 1 నాటికి ఆన్లైన్ లో పూర్తి చేయాలనీ కలెక్టర్ రాజర్శి షా అన్నారు.బుధవారం నేరడిగొండ ఎంపిడిఓ, తహసీల్దార్ కార్యాలయంలలో కొనసాగుతున్న ఆన్లైన్ నమోదు ప్రక్రియను పరిశీలించారు.డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తున్న విధానాన్ని పరిశీలించి, వారికి పలు సూచనలు చేశారు.